రామగుండం, 2026-08-29
రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ప్రతిభ కనబరిచి, పోలీస్ శాఖ అధికారుల ప్రశంసలు అందుకుంది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించిన అధికారులు, అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్లను గుర్తించారు.
రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించిన అధికారులు, అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్లను గుర్తించారు. ఈ క్రమంలో క్లస్టర్లో హైదరాబాద్, క్లస్టర్లో రామగుండం, క్లస్టర్లో నల్గొండ, క్లస్టర్లో సూర్యాపేట పోలీస్ యూనిట్లు మొదటి స్థానాల్లో నిలిచాయి.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్లకు ఈరోజు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి, ఉత్తమ ఫలితాలు సాధించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.











