నారాయణపేట, 2026-08-15
పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
సన్న బియ్యం పంపిణీ
గతంలో రేషన్ బియ్యం తినేవారిని చిన్నచూపు చూసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ఆ రోజులు పోయాయని మంత్రి అన్నారు. పెద్దవారైనా, పేదవారైనా అందరూ ఒకే రకమైన నాణ్యమైన బియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి పేద కుటుంబానికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ సోనా మసూరి బియ్యం తినేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో బోనస్
గతంలో వరి వేస్తే ఉరి అన్న పరిస్థితులు ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి ఉరి కాదు.. సిరి అని నిరూపించిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. పండించిన పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్మార్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ద్వారా బియ్యం మాత్రమే కాకుండా పేదలకు అనేక సంక్షేమ ప్రయోజనాలు అందనున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్డు పేదల భద్రతకు ప్రతీకగా నిలుస్తుందని, కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
స్థానిక పంపిణీకి ఆదేశాలు
ఏ గ్రామానికి చెందిన రేషన్ బియ్యాన్ని అదే గ్రామంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. స్మార్ట్ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.












