మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములును ఫోటోగ్రాఫర్ రాజు ఉమా యాడ్స్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ, వి. రాములు గతంలో మంచిర్యాల ఆర్డీవోగా పనిచేసిన సమయంలో జిల్లాకు ఎనలేని సేవలు అందించారని, ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆయన చొరవ అభినందనీయమని కొనియాడారు. అప్పట్లో ఎన్నికల విధుల్లో రాములు పర్యవేక్షణలో పనిచేయడం ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అంతటి అనుభవం ఉన్న అధికారి తిరిగి అదనపు కలెక్టర్గా మంచిర్యాల జిల్లాకే రావడం ఇక్కడి ప్రజలకు, సిబ్బందికి గర్వకారణమని రాజు అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధిలో ఆయన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుని విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సన్మానం సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది కూడా కలెక్టరేట్లో హాజరయ్యారు. వి. రాములు జిల్లా అభివృద్ధికి మరింత దోహదపడతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.





