మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు బస్టాండ్ పునరుద్ధరణ పనులపై శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ ఆధునీకరణ పనులకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
మంచిర్యాల బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, పునరుద్ధరణ పనులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాలలో దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరణ బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






