పెద్దపల్లి, 2026-07-22
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల తరపున ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ ను ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పెద్దపల్లి శాసనసభ్యులు గౌ శ్రీ చింతకుంట విజయరామణారావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు వ్యవహరిస్తున్న దేశ ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకోవడం కాదు, దేశ యువతపై కాస్త ప్రేమ ఉండాలని, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం లాఠీలతో జవాబివ్వడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషం, అప్రజాస్వామికమని, కూలిన కలలను చూడని పాలకులు, రాలిన విద్యార్థుల రక్తాన్ని కూడా చూడకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయొచ్చు కానీ, ప్రశ్నించే ఆలోచనను ఎన్నటికీ అణచలేరని, లీకైన పరీక్షా వ్యవస్థకు బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై లాఠీలు కాదు, వారికి న్యాయం, భరోసా, భవిష్యత్తు ఇవ్వాలని, లీకులతో లోకువైపోయిన లోటస్ లొట్టాపీస్ పార్టీ లాఠీలపై ఎన్నాళ్లు నిలబడగలదని ప్రశ్నించారు. విద్యార్థి శక్తి ముందు అహంకారం ఎప్పటికైనా తలవంచాల్సిందేనని పేర్కొన్నారు.











