మంచేరియల్, 9 September
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 1000 రోజుల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలను మోసం చేశారని రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఆయన ఛార్జ్ షీట్ విడుదల చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే- రఘునాథ్ వెరబెల్లి, రాష్ట్ర ఉపాధ్యక్షులు* *మంచిర్యాల ఎమ్మెల్యే 1000 రోజుల పాలన వైఫల్యాల పై ఈరోజు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు ఛార్జ్ షీట్ విడుదల చేసి పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు 1000 రోజుల పాలనలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఎన్నికల సమయంలో గెలిచిన 30 రోజుల్లో అండాలమ్మ కాలనీ డంపింగ్ యార్డు తరలిస్తామని, మూడు నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పెండింగ్ పరిహారం చెల్లిస్తామని, 6 నెల్లల్లో రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామని వంటి అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మంచిర్యాల - అంతర్గాం మధ్య 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభం అయిన వంతెన రద్దు చేయించి ఆ నిధులను పక్కా దారి పట్టించారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడానికి పోయాయని ప్రశించారు. 1000 రోజుల పాలనలో MLA చేసింది ఏదయిన ఉందా అంటే గంజాయిని ప్రోత్సహించడం, గూడాజియం, రౌడీయిజం, బెదిరింపులు వంటివి చేశారే తప్ప ప్రజలకు నయా పైసా ఉపయోగపడలేదు అని అన్నారు. ఎన్ని రోజులు గంజాయి బ్యాచ్ లను ప్రోత్సహించి ఇప్పుడు గంజాయి గురించి MLA మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వేంపల్లి లో పారిశ్రామిక పార్క్ పేరిట పేదల భూములు దోచుకున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చింద అని ప్రశ్నించారు. ఈ 1000 రోజుల పాలనలో మంచిర్యాల ప్రజల సొమ్ము దోచుకుని 470 కోట్ల అప్పు కట్టి, కాంట్రాక్టర్ ల వద్ద నుండి కమీషన్లు దోచుకోవడం, భూ ఖబ్జాలు మరియు భూ సెటిల్మెంట్ లు చేసి డబ్బు సంపాదించడం తప్ప చేసింది ఏమి లేదు అని అన్నారు. 22A లో మంచిర్యాల ప్రజల వేల నివాస భూములు మరియు లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే MLA ఒక్క గజం భూమి ఉన్న రాజీనామా చేస్తామనడం హాస్యపదం అని అన్నారు. మంచిర్యాల నియోజవర్గం ప్రజల పై MLA కు చిత్తశుద్ధి ఉంటే 22A జాబితా రద్దు చేయాలని లేని పక్షంలో ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా MLA ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, గోలి రాము, పట్టి వెంకట కృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, పచ్చ స్వప్న రాణి, డేగ బాపు, కస్తూరి నాగరాజు, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, కర్రె లచ్చన్న, రాకేష్ రెన్వ, జయరామ రావు, నాంపల్లి శ్రీనివాస్, అవిడపు రాజబాబు, ముదాం మల్లేష్, బల్జపల్లి తిరుపతి, బద్రి శ్రీకాంత్, నల్ల రవి, ఆడెపు కుమార స్వామి, పవన్, రవీందర్, మహేందర్, నల్లపు రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు



