మంచల్, 2026-11-20
మంచిర్యాల జిల్లాలో వసతి గృహాల సమస్యలపై టీఎన్జీవో ప్రతినిధులు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ కు ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కలెక్టర్ కుమార్ దీపక్ కు ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో నాణ్యమైన సరుకుల సరఫరా, మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి పలు సమస్యలపై విన్నవించారు. విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోసిన్, కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.


