హైదరాబాద్, 2026-06-05
తీజంతోబధడతూ15000డో15ఏళబణతదతఅబదఖతడ.హీబడఆైజహంతోఆంోందంచతఅూైదంచశ.
తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ, ప్లేట్లెట్స్ 15,000కు పడిపోయిన 15 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడటంలో రక్తదాత అబ్దుల్ ముఖిత్ కీలక పాత్ర పోషించారు. పరిస్థితి అత్యవసరంగా మారడంతో, బాలిక కుటుంబ సభ్యులు రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఫౌండర్ అబ్దుల్ రహీమ్ ని సంప్రదించారు.
తక్షణ స్పందన
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అబ్దుల్ రహీమ్, వెంటనే తన మిత్రుడు, రక్తదాత అబ్దుల్ ముఖిత్ కి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చేరుకుని, తన అమూల్యమైన (బి పాజిటివ్) రక్త పలకలు దానం చేసి బాలిక ప్రాణాలను నిలబెట్టారు.
కృతజ్ఞతలు
సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన అబ్దుల్ ముఖిత్ కి బాలిక కుటుంబ సభ్యులు,, రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఫౌండర్ అబ్దుల్ రహీమ్, మిత్రులు పాషా,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రక్తదానం ఆవశ్యకత
ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్, అబ్దుల్ ముఖిత్ మాట్లాడుతూ, ప్రస్తుతం జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రక్తదానం - ప్రాణదానం. సమయానికి ఇచ్చే రక్తం ఒక జీవితాన్ని నిలబెడుతుంది అని వారు అన్నారు.











