తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం ధర్మారావుపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో భాగంగా, 104 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లలో 40 మంది తమ నూతన గృహాల్లోకి ప్రవేశించారు.
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లబ్ధిదారులైన కొల్లూరి సుజాత - మల్లేష్, కొల్లూరి స్నేహ - మధుకర్ నిర్మించుకున్న ఇళ్లను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. గూడు లేనివారికి ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
గృహాలను అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమకు సొంత ఇంటిని అందించినందుకు ఎమ్మెల్యే దంపతులను శాలువాలతో సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం తమ జీవితాల్లో వెలుగు నింపిందని వారు పేర్కొన్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గ్రామస్థులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.












