మంచిర్యాల (ప్రజావార్త) నవంబర్ 19
అటవీ శాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 43 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోలో సభ్యత్వం తీసుకున్నారు. జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అటవీ శాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో అటవీ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న 43 నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని, జిల్లాలోని ఇంకా మిగిలిన యూనిట్లలో సభ్యత్వ నమోదును అతి త్వరలోనే పూర్తిచేసి, రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవాలని, అదేవిధంగా రాష్ట్రానికే జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు ప్రకాష్, అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.


