మంచేరియల్, 16 November
గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు నిరుపేదలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్ అని మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు పాత సుదర్శన్ తెలిపారు.
గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు నిరుపేదలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్ అని వాసవిక్లబ్స్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు, కార్యాలయ, మెంబర్షిప్ గ్రోత్ ఛైర్మన్ పాత సుదర్శన్ అన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాలలోని శ్రీనివాస గార్డెన్స్‌లో జిల్లా 107 గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో జరిగిన 9వ డిస్టిక్ డిస్కాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా 107 పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలలో ఉన్న 47 వాసవిక్లబ్స్ తమ వంతు సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నాయని ఆయన అభినందించారు. నిరుపేదలకు వాసవిక్లబ్స్ బాధ్యులు అండగా నిలుస్తున్నారని, వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సభ్యులలో అనుకోకుండా మరణించిన వారి కుటుంబాలకు మహాప్రస్తానం కింద రూ. 25 వేల ఆర్థిక సహాయం, నిరుపేదల ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 25 వేల ఆర్థిక సహాయం, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రూ. 25 వేల రుణ సదుపాయం, సరస్వతి పథకం ద్వారా నిరుపేద విద్యార్థులకు లక్ష నోటు పుస్తకాలను అందజేశామని ఆయన గుర్తుచేశారు.
వీటితో పాటు అవసరమైన చోట్ల శాశ్వత ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం, సంవత్సరం పాటు సేవా కార్యక్రమాలను అందించిన వాసవిక్లబ్ల సభ్యులకు ఉత్తమ అవార్డులను అందజేశారు. అలాగే, 2027 సంవత్సరానికి నూతన గవర్నర్‌గా ఎన్నికైన పబ్బ అరుణ తన క్యాబినెట్ బృందంతో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత గవర్నర్ బాల మోహన్ వారికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ డిస్కాన్ లో అంతర్జాతీయ అబ్జర్వర్ సుగ్గుల ప్రసన్నకుమార్, కాన్ఫరెన్స్ ఛైర్మన్ ముక్తా శ్రీనివాస్, ఎన్నికల అధికారి కొండ చంద్రశేఖర్, ఇంటర్నేషనల్ అధికారులు సిరిపురం రాజేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, సిరిపురం సత్యనారాయణ, ఎకిరాల శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, బాల సంతోష్, జంధ్యం మాధవి, జిల్లా గవర్నర్ పుల్లూరి అరుణ బాలమోహన్, క్యాబినెట్ అధికారులు ఎల్లంకి ప్రదీప్, కేశెట్టి వంశీకృష్ణ, కొంకుముట్టి వెంకటేశ్, వుత్తూరి రమేష్, రీజియన్ ఛైర్మన్, జోన్ ఛైర్మన్లు, జిల్లా అధికారులు, అన్ని వాసవిక్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, వాసవిక్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


