మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం రాఘవాపూర్ ప్రీమియర్ లీగ్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు జెర్సీలు, బ్యాట్లను అందజేశారు.
స్థానిక నాయకులతో కలిసి క్రీడాకారులను ప్రోత్సహించిన విప్ విజయరమణ రావు, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. రాఘవాపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ ప్రీమియర్ లీగ్ క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లీగ్ ప్రారంభోత్సవం అనంతరం, విప్ విజయరమణ రావు రాఘవాపూర్ గ్రామంలోని దుర్గాభవాని నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, క్రీడాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












