రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేతుల పరిశుభ్రత (హ్యాండ్ వాషింగ్) ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం జరిగింది. డీవైసీఎంఓ (అడ్మిన్) డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆసుపత్రి సిబ్బంది అందరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.
రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేతుల పరిశుభ్రత (హ్యాండ్ వాషింగ్)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీవైసీఎంఓ (అడ్మిన్) డాక్టర్ మధుకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందికి పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుకుమార్ గారు మాట్లాడుతూ, వైద్యులు, స్టాఫ్ నర్సులు, వార్డు అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, వంట చేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వైద్య మరియు ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సరైన సమయంలో చేతులు కడుక్కోవడం ద్వారా రోగాలను నివారించవచ్చని, వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా చూడవచ్చని, అలాగే డయేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. చేతులు శుభ్రం చేసుకునే విధానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా క్లుప్తంగా వివరించారు.
జీఎం శ్రీ రాధాకృష్ణ గారి సహకారంతో, సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్‌కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ మాథర్ సాహెబ్ గారు, మ్యాట్రన్ విజయకుమారి గారు, ఓఎస్ కృష్ణమూర్తి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు యూనియన్ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.












