లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి ఆధ్వర్యంలో, సురక్ష హాస్పిటల్ సీసీసీ మరియు యశోద హాస్పిటల్ మలక్పేట (హైదరాబాద్) సహకారంతో సీసీసీ కార్నర్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలు రకాల వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి ఆధ్వర్యంలో, సురక్ష హాస్పిటల్ సీసీసీ, యశోద హాస్పిటల్ మలక్పేట (హైదరాబాద్) వారి సౌజన్యంతో సీసీసీ కార్నర్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జి రెండవ జిల్లా గవర్నర్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ, యశోద హాస్పిటల్ సారధ్యంలో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో ఉచిత బీపీ, షుగర్, ఈసీజీ, గుండె సంబంధిత వ్యాధులు, 2 ఎకో మరియు స్త్రీల సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందించాలని, సురక్ష హాస్పిటల్, లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ క్యాంపు నిర్వాహకులైన డా. సాయి రామ్, డా. అభిరామ్ లను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో సురక్ష హాస్పిటల్ చైర్మన్ మరియు డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ లయన్ రాజేంద్రప్రసాద్, క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, లయన్స్ సభ్యులు మరియు యశోద హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.












