ఓదెల, 4 October
పెద్దపల్లి జిల్లా మండలం హరిపురం గ్రామానికి చెందిన పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మాతృమూర్తి స్వర్గీయ గుండేటి లక్ష్మి 9వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లా మండలం హరిపురం గ్రామానికి చెందిన పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మాతృమూర్తి స్వర్గీయ గుండేటి లక్ష్మి 9వ వర్ధంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, బంధుమిత్రులు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ గుండేటి లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, ఆత్మీయతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నునేటి సంపత్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు తాత రవి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ, శ్రీనివాస్, ఐలయ్య గౌడ్, పలువురు పాత్రికేయ మిత్రులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని స్వర్గీయ గుండేటి లక్ష్మికి ఘన నివాళులు అర్పించారు.












