మంచల్, 19 November
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కొనసాగుతోంది. ఈరోజు 38వ డివిజన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేశారు.

వార్డ్ ఆఫీసర్ నవీన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పూదారి విజయ రాణి, తిరుపతి గార్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, పెన్షన్ కోసం ఎవరూ దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రభుత్వం పేద, వృద్ధ, వితంతు, దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ వాసులు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.