మంచేరియల్, 2026-06-05
లక్షటి పెట్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ () అధికారులు తనిఖీ చేశారు. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగిన విజయ్ కుమార్ అనే వ్యక్తి డాక్టర్‌గా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు.
లక్షటి పెట్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ () అధికారులు తనిఖీ చేశారు. రోగి నుండి అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. స్టార్ ఫిజియోథెరపీ పేరుతో నడుస్తున్న ఈ క్లినిక్‌లో విజయ్ కుమార్ అనే వ్యక్తి తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ, కేవలం ఇంటర్ విద్యార్హతతోనే రోగులకు ఫిజియోథెరపీ పేరుతో చికిత్స అందిస్తూ, ఇంజెక్షన్లు ఇస్తూ, మందులు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు.
కౌన్సిల్ నివేదిక
తనిఖీ సందర్భంగా సేకరించిన ఆధారాలు, వాస్తవాల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను తదుపరి చర్యల నిమిత్తం కౌన్సిల్‌కు సమర్పించడంతో పాటు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ()కి కూడా పంపనుంది. చట్ట ప్రకారం తగిన న్యాయపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని ను కోరనుంది.
ప్రజలకు విజ్ఞప్తి
అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించడం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని కౌన్సిల్ పేర్కొంది. వైద్య సేవలు పొందే ముందు, సంబంధిత వైద్యుడు చట్టబద్ధంగా నమోదైన అర్హత కలిగిన వైద్యుడేనా అని నిర్ధారించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అక్రమ వైద్య కార్యకలాపాలపై సమాచారాన్ని సంబంధిత అధికారులకు లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు అందించి సహకరించాలని కోరింది.
తనిఖీ బృందం
ఈ తనిఖీ బృందంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా. శ్రీనివాస్ ఎగ్గన, కో-ఆప్షన్ సభ్యులు డా. అనిల్ ముత్తినేని, మంచిర్యాల హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డా. సంతోష్ చెందూరి పాల్గొన్నారు.












