మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన చిప్పకుర్తి సతీష్, ఎంబీఏ, బీపీఈడి, బీకాం మూడు డిగ్రీలలో విశేష ప్రతిభ కనబరిచినందుకు గాను బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఇందారం గ్రామానికి చెందిన సతీష్, విద్యారంగంలో తన ప్రతిభతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. మూడు విభిన్న రంగాలలో డిగ్రీలు సాధించి, ప్రతిభ కనబరచడం పట్ల బీసీ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది, బీసీ సంఘం నాయకుడు శ్రీ ఆడెపు కుమారస్వామి, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. సతీష్ సాధించిన విజయం అనేకమంది యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, గాయకుడు సిరికొండ బోస్ మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో ఇలాంటి విజయాలు సాధించడం ఎంతో సంతోషకరమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి బాపు, బర్కాం శంకర సేన, బండారి రాయమల్లు, మదన్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సతీష్‌ను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ తన విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.











