మంచేరియల్, 10 September
క్యాతనపల్లి: రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్టు దుస్స శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో 16 మంది సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పోలు దాసరి శ్రీనివాస్, కోశాధికారిగా పరికిపండ్ల రాజులను ఎన్నుకున్నారు.
రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా దుస్స శివప్రసాద్. - నూతన కార్యవర్గం ఎన్నిక. క్యాతనపల్లి : రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు(నినాదం దినపత్రిక) దుస్స శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో 16 మంది సభ్యులు సమావేశమై ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పోలు దాసరి శ్రీనివాస్, కోశాధికారిగా పరికిపండ్ల రాజు లను ఎన్నుకున్నారు.మూడు నాలుగు రోజుల్లో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు ప్రకటించారు.అలాగే పలు తీర్మానాలు చేశారు. సంఘ అభివృద్ధికి గాను కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో పలు పత్రికల్లో పని చేస్తున్న సీనియర్, జూనియర్ జర్నలిస్టులు రవీంద్రఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రవీంద్రఖని ప్రెస్ క్లబ్. - పేద ప్రజలకు అండగా ఉంటాం. - శివప్రసాద్. కేతనపల్లి మున్సిపాలిటీలో పేద ప్రజలకు అండగా రవీంద్రకాని ప్రెస్ క్లబ్ ఉంటుందని అధ్యక్ష శివప్రసాద్ అన్నారు ప్రభుత్వ పథకాలలో వారికి సహాయం చేస్తామన్నారు. ఎవరైనా ప్రెస్ పేరిట వసూళ్లకు పాల్పడ్డా, ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా తమ క్లబ్ సభ్యులకు తెలపాలని ఆయన ప్రజలను కోరారు. ప్రెస్ పేరిట చాలామంది తమ ఇబ్బందులు చేస్తున్నారంటూ పలు ఫిర్యాదుల తమ దృష్టికి వచ్చాయని, ప్రెస్ వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు గానీ రాజకీయ నాయకులు గాని పట్టించుకోరనే అపవాదు వదిలేయాలని, ప్రజలకు చట్టపరంగా అన్ని హక్కులు ఉంటాయని గుర్తించాలని ఆయన కోరారు. అలాంటి పరిస్థితులలో ప్రజలు రవీంద్రఖని సభ్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు సమాజంలో సైనికుల్లా ఉంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు నాలుగో స్తంభం కూడా ప్రలోభాల మాయలో పడి ఇబ్బందులు పాలవుతున్నదని,ఏమీ రాయలేని స్థితికి వచ్చిందన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లకు అతీతంగా రవీంద్రఖని ప్రెస్ క్లబ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో తూముల భవిష్యత్,మామిడాల రవీందర్,కందుల ప్రవీణ్,రామిడి సాయి సృజన్,కరెడ్ల రఘు,దండు సదానందం,నరెడ్ల వెంకన్న, కోల శ్రీనివాస్,బొద్దుల భూమయ్య,బత్తుల సతీష్ కుమార్,అప్పని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.












