మంచేరియల్, 2026-06-05
మంచిర్యాల ప్రజలకు రక్షాబంధన్ పండుగ సందర్భంగా డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ అని ఆమె పేర్కొన్నారు.

సోదరుడు-సోదరి బంధం జీవితాంతం ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో కొనసాగాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ఆకాంక్షించారు.
రాఖీ కట్టే ప్రతి చేయి ఆనందంగా ఉండాలని, రాఖీ కట్టించుకునే ప్రతి సోదరుడు బాధ్యతగా నిలవాలని ఆమె అన్నారు. ప్రతి ఇంటా ప్రేమానురాగాలు వెల్లివిరియాలని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ఆకాంక్షించారు.