మంచిర్యాల (ప్రజావార్త) ఆగస్టు 09
మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలు పట్టణంలోని బాలుర పాఠశాల హాల్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ రాష్ట్ర నాయకులు ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నికలు పట్టణంలోని బాలుర పాఠశాల హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ () రాష్ట్ర నాయకులు మహమ్మద్ వలీవుద్దీన్, నిష్టల శ్రీనివాస్, ఎండి. రంజాన్ సమీలు పర్యవేక్షకులుగా హాజరయ్యారు.
నూతన కార్యవర్గం వివరాలు
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా గొర్రె దేవయ్య, ఉపాధ్యక్షుడిగా జిల్లి చిరంజీవి, గౌరవ ప్రధాన కార్యదర్శిగా జూపాక అరుణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎనుముల కుమార్, కోశాధికారిగా పరుపల్లి చక్రధర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గెడం రాజేశ్వర్, మోటపలుకుల ప్రశాంత్, ఎండి. యాసిర్ అఫారత్, సలహాదారుగా వెన్నమనేని ప్రసాద్ రావు వ్యవహరిస్తారు.
క్రీడాకారులకు భరోసా
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ, జిల్లాలోని బధిర క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.











