మంచేరియల్, 23 September
మంచిర్యాలలోని 12వ డివిజన్ బాలాజీ బృందావన్ కాలనీలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు దంపతులు వరుసగా ఐదో సంవత్సరం లడ్డును దక్కించుకున్నారు. ఇది తమకు గణపయ్య దయ అని కార్పొరేటర్ అన్నారు.
మంచిర్యాల : 12వ డివిజన్లోని బాలాజీ బృందావన్ కాలనీలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు దంపతులు వరుసగా ఐదో సంవత్సరం లడ్డును దక్కించుకున్నారు.
వేలంలో లడ్డును దక్కించుకున్న అనంతరం కస్తూరి నాగరాజు మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా గణేష్ మండలి లడ్డు తమ ఇంటికి రావడం గణపయ్య దయగా భావిస్తున్నాను అని అన్నారు. గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
లడ్డు దక్కించుకున్న అనంతరం నాగరాజు దంపతులు గణేష్ మండలి సభ్యులు, భక్తుల మధ్య ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


