మంచేరియల్, 14 October
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని 12వ డివిజన్లోని ప్రధాన రహదారులతో పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాల్లో కార్పొరేటర్ కస్తూరి నాగరాజు పారిశుద్ధ్య పనులను శరవేగంగా చేపించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు.
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని 12వ డివిజన్లోని ప్రధాన రహదారులతో పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాల్లో కార్పొరేటర్ కస్తూరి నాగరాజు పారిశుద్ధ్య పనులను శరవేగంగా చేపించారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు.
ఈ మేరకు మున్సిపల్ అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తూ పారిశుద్ధ్య పనులు, రహదారుల శుభ్రత, ఇతర అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
పండుగల సందర్భంగా ప్రజలు, మహిళలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కస్తూరి నాగరాజు అధికారులకు విజ్ఞప్తి చేశారు.












