ఎల్కతుర్తి, 6 November
హన్మకొండ జిల్లా, మండల కేంద్రంలో నూతన కోర్టు మంజూరుతో పాటు, దానికి అవసరమైన 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
హన్మకొండ జిల్లా, మండల కేంద్రంలో నూతన కోర్టు మంజూరుతో పాటు, దానికి అవసరమైన 56 పోస్టులను కేబినెట్ ఆమోదం పొందేలా కృషి చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. బీసీ బిడ్డగా రాజకీయాల్లో ఎదిగి, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్న పొన్నం ప్రభాకర్ పట్టుదల, కార్యదక్షతకు ఈ కోర్టు మంజూరే నిదర్శనమని కొనియాడారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చడంలో ఆయన ముందుంటారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కి నూతన కోర్టును మంజూరు చేయించడమే కాకుండా, 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం తీసుకురావడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లోనే కాకుండా చేతల్లోనూ తన పనితీరును నిరూపించుకున్నారని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయని, ఈ నిర్ణయం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాదులందరి తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్, ఏఎంసి చైర్మన్ సంతాజి, సింగిల్ విండో అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షురాలు శనిగరపు స్వరూప, బొమ్మనపెల్లి అశోక్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోలి రాజేశ్వర్ రావు, ఏఎంసి డైరెక్టర్ గొడిశాల రాజయ్య గౌడ్, బచ్చు బాపు రావు, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, బక్కి గొడిశాల అర్జున్ గౌడ్, శనిగరపు వెంకటేశ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.











